Handloom Workers Welfare Support
ఆకేరు న్యూస్, కమలాపూర్:
చేనేత సంఘాలకు, కార్మికులకు ఏ ఆపద వచ్చినా అండగా, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. కమలాపూర్, మర్రిపల్లిగూడెం, గోపాలపూర్ చేనేత సహకార సంఘాల నూతన అధ్యక్షులైన బైరి జనార్ధన్, పోరండ్ల రమేష్, మామిడాల రమేష్ , పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షులను,కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి ప్రణవ్ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొప్ప శివశంకర్, క్యాతం రవీందర్, మెండు రాంబాబు, చేరాల వెంకట్రాజం, బొల్లం రాజిరెడ్డి, పుల్ల శోభన్ పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
