Mulugu Road Accident Deaths
* రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.
ఆకేరు న్యూస్ ములుగు :
ములుగు జిల్లా
గోవిందరావు పేట మండలం మచ్చపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన జరిగింది.తెలిసిన వివరాల ప్రకారం గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన ఈక చిన్న అప్పయ్య (50),
అరేం బిక్షపతి (38)
ఇద్దరు ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పని పై ములుగు వైపు వెళ్తుండగా హన్మకొండ వైపు నుంచి ఏటూరు నాగారం వెళ్తున్న ఐరన్ లోడ్ లారి అదుపు తప్పి మచ్చ పూర్ సమీపంలో ద్విచక్ర వాహనం ను ఢీ కొట్టింది.దింతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
