Kamalapur Congress protest
* తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి
* అతడిపై అట్రాసిటీ నమోదు చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ మండల ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బీఆరఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించిన మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే తొలగించాలని, అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో బీఆరఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తౌటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, మాట్ల రమేష్, డాక్టర్ మౌటం కుమారస్వామి, విష్ణు దాస్ వంశీధర్ రావు, బొల్లం రాజిరెడ్డి, పుల్ల శ్రీనివాస్, పోడేటి భిక్షపతి, మాట్ల కల్యాణ్, పుల్ల శోభన్, మొండెద్దుల నాగరాజు, నాంపల్లి ప్రభాకర్, మాట్ల రవీందర్, గంధసిరి అనిల్, జన్ను భిక్షపతి, గాలిబ్ నవీన్, చేరాల రోహిత్, మనీష్, తాటిపాముల రాములు, పాక చంద్రమౌళి, నల్లని సురేష్, శనిగరపు రమేష్, సుభాష్, పుల్ల ఐలయ్య, సురేష్, అబ్బర వేణి అనిల్, పాక అనిల్, పల్లె సమ్మిరెడ్డి, గంధసిరి భిక్షపతి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
