Nandamuri Mokshagna - Vassishta with Mythri Movie Makers
* విశ్వంభర దర్శకుడికి బిగ్ ఛాలెంజ్
ఆకేరు న్యూస్, డెస్క్: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
* విశ్వంభర దర్శకుడికి బిగ్ ఛాలెంజ్..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్న దర్శకుడు వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
* యంగ్ లయన్ కు పుట్టినరోజు శుభకాంక్షలు..
బాలకృష్ణ, మోక్షజ్ఞలను కలుసుకుని, యంగ్ లయన్ కు చిత్ర బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొన్ని స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్స్ మోక్షజ్ఞ స్టైలిష్‌గా, ఫిట్‌గా, చాలా హ్యాండ్సమ్ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ ఇప్పటికే ఇంటెన్స్ గా ఉన్నారు. కమర్షియల్ హీరోకు అన్ని అంశాల్లో శిక్షణ తీసుకుంటూ ఫిజికల్, పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
* హీరోగా మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై భారీ అంచనాలు..
మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తుండటం, వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండటం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలని మేకర్స్ వెల్లడించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
