*కన్నూర్‌లో పశు వైద్య శిబిరం
– లింగ నిర్ధారణ వీర్యం కృత్రిమ గర్భధారణ రైతు సోదరులకు ప్రయోజనకరం
ఆకేరు న్యూస్ కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూర్ లో బుధవారం జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరంను గ్రామ సర్పంచ్ పుల్లూరి శోభారాణి-శ్రీనివాస రావు, ఉపసర్పంచ్ ఇనుగాల రాజు , వార్డ్ మెంబర్లు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఉప్పల్ పశువైద్యాధికారి డా .ప్లవన్ మజందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేస్తే, ఆడ దూడలు మాత్రమే పుడతాయని, దీనిని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని, దూడల పెంపకం, పశుగ్రాసాల సాగు గూర్చి రైతులకు తెలిపారు. ఈ శిబిరంనకు వచ్చిన పాడి పశువులకు పశువైద్యాధికారి డా.. ప్లవన్ మజందర్, మండల పశువైద్యాధికారి డా. ఏ. బాలకృష్ణ, శనిగరం పశువైద్యాధికారి డా.. వైద్యం విక్రమ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 108పశువులు రాగా 28 ఎదకు రానివి, 32దూడలకు నట్టల నివారణ మందులు, 6గెదేలకు కృత్రిమ గర్భధారణ, 68గర్భకోశ వ్యాధులకు చికిత్సలు జరిపినారు. బాహ్య పరాన్న జీవుల చికిత్సలో భాగంగా స్ప్రే మందు 88 పశువులకు పిచికారీ చేశారు. కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ వెంపటి.రాజేశ్వర్ రావు, పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రులు పి. చక్రపాణి,ఎస్. శ్రీనివాస్, యం. డి.సాధిక్, ఏ.కుమార్,ఇంటాస్ ఫార్మా కంపెనీ ప్రతినిది శ్రీకర్ మరియు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు
