– అసెంబ్లీ ఎలక్షన్లను తలపించేలా నేతల ర్యాలీలు, రోడ్‌షోలు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండల వ్యాప్తంగా సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎలక్షన్లలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చేశామని, ప్రజల అవసరాలు తీర్చామని తమ పార్టీకి చెందిన సర్పంచ్, వార్డ్ మెంబర్లకు పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు అటు కరీంనగర్, ఇటు కొత్త హనుమకొండ లో కమలాపూర్ అంటేనే ఎప్పుడూ ఒక ప్రత్యేకత. ఈ మండలంలో ఏ ఎన్నికలొచ్చిన ఓటరు ఎప్పుడు అందరి కంటే కూడా బలవంతుడిగా ఉంటున్నాడు. నాటి ఉప ఎన్నికల నుంచి నేటి స్థానిక ఎలక్షన్ల వరకు ఓటరు ను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. మొదటి విడత స్థానిక ఎన్నికల్లో కూడా ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బిజెపి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ మండలంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ, అసెంబ్లీ ఎలక్షన్లను తలపించేలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.బడా నేతల ప్రచారాలు స్థానిక ఎన్నికల్లో ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే.
………………………………………..
