ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెళ్లిగూడెం గ్రామానికి చెందిన ఎండి ఇర్ఫాన్ అహ్మద్ ఉస్మానియా యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల మధ్య జరిగే ఈ క్రీడా పోటీలను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ జనవరి 14 నుంచి 17 వరకు చెన్నయ్ లో నిర్వహిస్తుంది. ఈ పోటీలకు ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న మహమ్మద్ ఇర్ఫాన్ గతంలో నాలుగు సార్లు నేషనల్ , ఎనిమిది సార్లు రాష్ట్రస్థాయి పాల్గొని బ్యాడ్మింటన్లో ప్రతిభ కనబరచటంతో జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇర్ఫాన్ అహ్మద్ ఎన్నిక పట్ల మర్రిపల్లి గూడెం గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి, గ్రామ సీనియర్ క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
……………………………………………

