* ఎంఎన్ ఎం అధినేత రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్
ఆకేరు న్యూస్ డెస్క్ : నా సభలకూ జనాలు వచ్చారు కానీ ఓట్లు పడ్డాయా అంటూ కమల్
మీడియాతో అన్నారు. ఎంఎన్ ఎం అధినేత రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకుల సభలకు జనాలు లక్షల్లో తరలి వచ్చినంత మాత్రాన అవి ఓట్లుగా మారుతాయని భావించ వద్దని కమల్ పేర్కొన్నారు. సినీ నటుడు తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ రెండు రోజుల క్రితం తిరువారూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపధ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్ పై విధంగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత నిర్వహించిన సభలకు కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారని కమల్ గుర్తు చేశారు. రాజకీయ సభలు వచ్చిన జనం ఓట్లేయరు అని గత అనుభవాలు చెప్తున్నాయని కమల్ అన్నారు. ఈ విషయం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు అని కమల్ అన్నారు. వచ్చే ఏడాది తమిళ నాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీల నేతలు సభలు సమావేశాల్లో నిమగ్నం అయ్యారు. పరస్పర విమర్శలు కూడా ఎక్కువయ్యాయి, ఇప్పటికే తమిళ రాజకీయాల్లో సినిమా తారల తళకులు ఎక్కువే..అన్నాదురై,కరుణానిధి,శివాజీగణేషన్, ఎంజి రాంచంద్రన్,జయలలిత,విజయకాంత్,కమల్ హాసన్,ఉదయనిధి స్టాలిన్,శరత్ కుమార్, రాధిక,కుష్బూ,సీమన్, టి రాజేందర్ లు తమిళనాడు రాజకీయాల్లో భాగమయ్యారు ఇప్పుడు తాజాగా యువ హీరో విజయ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఈ నేపధ్యంలో విజయ్ సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. విజయ్ సభలకు వస్తున్న స్పందనపై రాజకీయ నాయకులు ఎవరికి వారే స్పందిస్తున్నారు.
………………………………………
