Karreguttalu Road Inspection Mulugu
* కర్రేగుట్టల రోడ్ పనులను పరిశీలించిన సి ఆర్ పి ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ రవిదీప్ సింగ్ సహా
ఆకేరు న్యూస్,ములుగు :
ములుగు జిల్లా – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతాన్ని గురువారం సి ఆర్ పి ఎఫ్ దక్షిణ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిదీప్ సింగ్ సాహి ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ తో కలిసి సందర్శించి రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు.
కర్రెగుట్టల వంటి కఠినమైన భూభాగంలో వేగంగా జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.మోరుమూరు నుండి పామునూరు, పామునూరు నుండి జెల్లా, జెల్లా నుండి డోలి, డోలి నుండి తడపాల కొండల వరకు రహదారి నిర్మాణ పనులు పూర్తికావడంతో పోలీస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అత్యంత క్లిష్టమైన అటవీ ప్రాంతంలో సైతం వేగవంతంగా రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు. ఈ రహదారుల నిర్మాణంతో స్థానిక గిరిజన ప్రజలకు రవాణా, వైద్య, విద్య అత్యవసర సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అనంతరం అధికారులు పామునూరు సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించి భద్రతా పరమైన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రతా బలగాల సమన్వయం, సరిహద్దు ప్రాంత భద్రత, మావోయిస్టు వ్యతిరేక చర్యలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీ అనిల్ మింజ్ , 81 బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్ , 39 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండ్ పంచం లాల్, జాంగ్షేర్ వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, ఎస్సై తిరుపతి రావు జిల్లాస్థాయి సిఆర్పిఎఫ్ సివిల్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
