Petrol Diesel Price Hike
* పెట్రోల్: రూ. 110.78 (లీటరుకు)
* డీజిల్: రూ. 98.70 (లీటరుకు)
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచడంతో, హైదరాబాద్లో కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు రూ. 107.50 వద్ద ఉన్న పెట్రోల్ ధర, తాజా పెంపుతో రూ. 110 దాటింది. అదేవిధంగా, డీజిల్ ధర కూడా రూ. 95.70 నుండి రూ. 98.70కి చేరింది.
స్థానిక పన్నులు , డీలర్ కమిషన్ల ఆధారంగా వివిధ పెట్రోల్ బంకుల వద్ద ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఇంధన ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై రవాణా, నిత్యావసర వస్తువుల ధరల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. తాజా పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. పెట్రోల్: రూ. 110.78 (లీటరుకు) ,డీజిల్: రూ. 98.70 (లీటరుకు) గా ఉంది.
ALSO READ :
