
* నష్కల్ నుండి చింతలపల్లి గూడ్స్ లైన్‌పై పునరాలోచించాలి
* కాజీపేట రైల్వే హాస్పిటల్‌ను మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేయాలి
* రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్‌ను కోరారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ నిర్వహించిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, లెవల్ క్రాసింగ్ గేట్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు తదితర అంశాలను ఎంపీ రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్ గ్రేడ్ చేయాలని, ఆ దిశగా రైల్వే బోర్డు మరియు రైల్వే మంత్రికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. కొత్తగా చేపట్టనున్న నష్కల్ టు చింతలపల్లి గూడ్స్ రైల్ లైన్ నిర్మాణంపై పునరాలోచన చేయాలని కోరారు. కొత్త లైన్ ప్రతిపాదనలపై స్థానిక ప్రజా ప్రతినిధులను, రైతులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని.. దీంతో స్థానిక రైతుల నుండి వ్యతిరేకత వస్తుందని వివరించారు.
కాజీపేట జంక్షన్‌లోని హాస్పిటల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని.. వెంటనే హాస్పిటల్లో సిబ్బంది నియమాకాన్ని చేపట్టడంతో పాటు మహిళా డాక్టర్‌ను ఆపాయింట్ చేయాలని కోరారు. మ్యానిఫాక్చర్ యూనిట్‌ను కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేసినందుకు రైల్వే శాఖకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఫాతిమా నగర్ ఆర్ఓబీ నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తున్నాయని, కావున వెంటనే ఆర్ఓబీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. కాజీపేట జంక్షన్లో సరిపడా ప్లాట్ ఫామ్స్ లేనందున రైళ్ళ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందునా ప్లాట్ ఫామ్‌లను పెంచాలని కోరారు. కాజీపేట జంక్షన్ ఆవరణలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బస్టాండ్ ఏర్పాటు స్థలం కేటాయించాలని కోరారు. ఎంపీ ప్రస్థావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన రైల్వే అధికారులు రానున్న బోర్డు మీటింగ్‌లో పై అంశాలను బోర్డు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
……………………………………………………