
* కేరళ ప్రజలపై జెలసీ ఉంది
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్,డెస్క్ : కేరళ ప్రజలపై తనకు జెలసీ ఉందని కేసీ వేణుగోపాల్ పై కూడా కోపం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కేరళ రాష్ట్రంలోని అలెప్పిలో మెరిట్ విద్యార్థులకు అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గాంధీ కుటుంబం నుంచి ఒకరు తెలంగాణలో పోటీ చేస్తే బాగుటుందని రాహుల్ గాంధీని పోటీ చేయమని రిక్వెస్ట్ చేశామని కానీ కేసీ వేణుగోపాల్ మాకు అవకాశం ఇవ్వకుండా కేరళ నుంచి రాహుల్ కు పోటీచేసేందుకు ఒప్పించారని రేవంత్ అన్నారు. ఆ తరువాత ప్రియాంక గాంధీ కూడా మాకు అవకాశం ఇవ్వ లేదని అన్నారు. అందుకే కేరళప్రజలపై,కేసీ వేణుగోపాల్ పై నాకుజెలసీ ఉందని రేవంత్ రెడ్డి సరదాగా అన్నారు.తెలంగాణకు దక్కని గొప్ప అవకాశం కేరళకు దక్కిందని అన్నారు. తాను 2006 లో ఇండిపెండెంట్ సభ్యుడిగా స్థానిక సంస్థల్లో ప్రతినిధిగా ఎన్నికయ్యానని ఆ తరువాత 2023 సంవత్సరం వచ్చే సరికి తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యానని పట్టుదల అంకిత భావంతో పని చేస్తే అన్నీ సాధ్యమేనని అన్నారు. తన ఎదుగుదలకు కేసీ వేణు గోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. తనకు పెద్దన్న లాగా కేసీ వేణుగోపాల్ ఎప్పడు తననున ప్రోత్సహిస్తారని రేవంత్ అన్నారు.ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన ఓటు చోరీకి వ్యతిరేకంగా తాము దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతి భారతీయుడు ఓటు హక్కును కాపాడాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. బీజేపీ యువత హక్కులను కొల్లగొడుతోందని విమర్శించారు.
…………………………………