* కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందని తండా వాసులతో ముచ్చట్లు
* ఈ కలుసుడేందో ఆప్పుడు కలిస్తే ఈ తిప్పలు ఉండక పోయేది కదా..!
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ మిర్చీలు, బజ్జీలు తిన్నారు. టీ తాగారు.. ఊహించని ఈ పరిణామానికి తండా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో భాగంగా వరంగల్ నుంచి తొర్రూర్ మీదుగా ఖమ్మం వెళుతున్నారు. మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద ఉన్న ఓ చిన్న హోటల్‌ను చూసి బస్సు ఆపించారు. నెమ్మదిగా దిగి ఆ హోటల్‌కు వెళ్ళి కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న తండా వాసులు ఆయన చుట్టూ చేరారు. కరెంట్ సక్రమంగా వస్తుందా..? పంటలకు నీళ్ళు అందాయా..? అప్పుడు పాలన ఎట్లా ఉండేది..? ఇపుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది ..తాగు నీటి సంగతి ఏంది..? అని అడిగి తెలుసుకున్నారు. కరెంట్ అప్పుడప్పుడూ పోతోంది.. పంటలకు మాత్రం సాగు నీటి ఇబ్బందులు వచ్చాయన్నారు. హోటల్లో తయారు చేసిన మిర్చీలు, బజ్జీలు, పకోడీలను కేసీఆర్ రుచి చూశారు. అనంతరం టీ తాగారు.. రైతులు ఇబ్బంది పడొద్దు మళ్ళా మన రోజులు వస్తాయి అంటూ వారికి ధైర్యం చెప్పారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు ఉన్నారు.
* ఈ కలుసుడేందో ఆప్పుడు కలిస్తే ఈ తిప్పలు ఉండక పోయేది కదా..!
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను కలవడానికి వచ్చినోళ్ళను కలిస్తే ఈ తిప్పలు ఉండక పోయేది కదా..! సారు అప్పుడు ఫామ్ హౌజ్ లో ఉండి ప్రగతిభవన్‌కే రాక పాయే.. వచ్చినా ప్రజలను కలువక పాయే… ప్రజల ముచ్చట పక్కకు బెట్టి మంత్రులనే కలవక పాయో కదా.. అప్పుడు కలిస్తే ఇపుడు ఇట్లా రోడ్డు మీద పడే పరిస్థితి రాకపోయేది కదా అని తండా వాసులు మాట్లాడుకోవడం వినిపించింది. నిజమే మరీ, అప్పడు ఎవ్వరిని కలవక పాయే..కలిస్తే ముచ్చట వేరే లెవల్ ఉండేది కదా అని అందరూ అనుకుంటున్నారు..
——————————–