ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30) మంగళవారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు. విద్యార్థులు ఫలితాల కోసం https://results.bsetelangana.org వెబ్సైట్ ను సంప్రదించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 2,676 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. వీటికి 5.08,385 విద్యార్థులు హాజరయ్యారు.
—————————————
Fine