ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao) ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ (Assembly) లోఅడుగుపెట్టారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యారు. ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు అసెంబ్లీలో చక్రం తిప్పిన కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వస్తారా.. అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌పై నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక చర్చలో కూడా కేసీఆర్ పాల్గొనలేదు. దీనిపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు చేశారు. కాగా ఈరోజు తెలంగాణ బడ్జెట్ (Telangana Budjet) ప్రవేశపెడుతుండడంతో కేసీఆర్ వస్తారా, లేదా అనే చర్చ మొదలైంది. ఎట్టకేలకు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు పెట్టారు.
———————-