* బడ్జెట్ ప్రసంగం ఓ కథలా ఉంది
* దళిత బంధు ప్రస్తావన లేదు.. మత్య్సకారులకు భరోసా లేదు
* రైతు శత్రు ప్రభుత్వం కాంగ్రెస్
* గ్యాస్.. ట్రాష్ తప్పా.. బడ్జెట్ ప్రసంగంలా లేదు..
* రాజకీయసభలో ప్రసంగంలా ఉంది
* పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు..
* భవిష్యత్ లో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం
* బడ్జెట్ ప్రసంగంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్షన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ (Assembly) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budjet) పై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) , ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని, ఇది అర్బక ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి భట్టి (Finance Minister Bhatti) డబ్బు ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఒత్తి.. ఒత్తి పలకడం తప్ప బడ్జెట్ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం ఓ కథలా ఉందన్నారు. గ్యాస్.. ట్రాష్ తప్పా.. బడ్జెట్ ప్రసంగంలా లేదని ఓ రాజకీయ సభలో ప్రసంగంలా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్లో దళితుల గొంతుకోశారన్నారు. దళిత బంధు ప్రస్తావన లేదని, మత్య్సకారులకు భరోసా లేదని విమర్శించారు. బడ్జెట్ ను పరిశీలిస్తే ప్రభుత్వానికి ఏ రంగంపైనా ఓ పాలసీ అంటూ లేదని తెలుస్తోందన్నారు. గొర్రెల పెంపకం పథకాన్ని పూర్తిగా మూసేసినట్లు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందన్నారు. రైతు శత్రు ప్రభుత్వం కాంగ్రెస్ (Congress) అన్నారు. ధాన్యం కొనుగోళ్లు లేవని, విద్యుతు సరఫరా సక్రమంగా లేదని, రైతుబంధు, రైతుభరోసా క్లారిటీ లేదని తెలిపారు. వృత్తి కార్మికులను వంచించిందని, ఇండస్ట్రీయల్ పాలసీ లేదని విమర్శించారు.
పద్ధతి కానీ, పాలసీ కానీ లేదన్నారు. ఇది రైతుల బడ్జెట్ కాదని, పేదల బడ్జెట్ కాదని ఎవరి బడ్జెట్టో విశ్లేషణలో తెలుస్తాదని వివరించారు.
ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నామని, ఈ 6 నెలల్లో చేసింది శూన్యమన్నారు. ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.
—————————–