
* చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshweram project)పై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr),మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు(harish rao)లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆదివారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆదివారం విచారణ చేయడానికి హై కోర్టు నిరాకరించింది.దీంతో సోమవారం అదే బెంచ్‌లో లంచ్ మోషన్ లో విచారణ జరపాలని కోరారు. కోర్టు లంచ్ మోషన్‌కు కూడా స్వీకరించలేదు. రెగ్యులర్ పిటిషన్ల (regular petition)లాగే ఆ పిటిషన్‌ను కూడా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేస్తామని తెలిపింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేమని, సీబీఐ విచారణ ఆపాలని కూడా ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రేపు ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనల్ని కోర్టుకు వినిపించనున్నారు.
………………………………….