* విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు
* సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా చేస్తున్నారు
* నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు
* విద్యుత్ కమిషన్ విచారణ తీరును తప్పుబట్టిన కేసీఆర్
* వివరాలు.. విమర్శలతో 12 పేజీల లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి ( Justice L Narsimha Reddy ) గారికి.. అంటూ విద్యుత్ ఒప్పందాలపై ఏర్పడిన పవర్ కమిషన్‌కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) వినూత్న పంథాలో వివరణ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాలపై జూన్ 15లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన కమిషన్‌కు అదే తేదీన 12 పేజీల లేఖ (12 Pages letter) రాశారు. నేను.. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు.. కాబట్టే ఈ లేఖ రాస్తున్నా అన్నారు. కమిషన్ తీరును కేసీఆర్ తప్పుబట్టారు. కేసు విచారణలో అవలంబించిన తీరుతో విచారణాధికార కోల్పోయారని.. ఈ లేఖలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. మీరు మీ బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి సూచించడం సంచలనంగా మారింది.
కేసీఆర్ లేఖలోని ముఖ్యాంశాలు..
రాష్ట్రం ఏర్పడ్డనాడు..
తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం జగమెరిగిన సత్యం. తెలంగాణ ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్‌కు కరెంట్ సక్రమంగా సరఫరా లేదని వెల్లడించారు. 12 పేజీలతో కూడిన లేఖలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్ సమస్యల నుంచి పదేళ్లలో చోటు చేసుకున్న మార్పుల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పడిన కొత్తలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఫలితంగా ఏ ఒక్క రంగం కూడా సక్రమంగా నడవలేకపోయిందని గుర్తు చేశారు. పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. మునిసిపాలిటీల్లో 6 గంటలు.., రాజధాని హైదరాబాద్‌లో ఏకంగా 4 గంటల పాటు కరెంట్ కోతలుండేవి. అందరూ కరెంట్ బాధితులే అన్నారు.
కమిషన్ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం
తెలంగాణకు చట్ట ప్రకారం 53.89 శాతం, ఏపీకి 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడిందని చెప్పారు. మొత్తంగా 5 వేల మెగావాట్ల కొరతతో తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందన్నారు ఈ నేపథ్యంలోనే విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో 7778 మెగావాట్లు విద్యుత్తు స్థాపన ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ చూస్తే… 20,000 మెగావాట్లకు పైచిలుకు చేరటం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు.
‘రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది మందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే కమిషన్ వేశారు. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చూపించేందుకే ప్రభుత్వ ప్రయత్నాలు. ఈఆర్ సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధం. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించటం విచారకరం.
విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. వాస్తవానికి జూన్ 15న మీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలనుకున్నా. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి… అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే జూన్ 11వ తేదీన మీడియా సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ లేఖ రాస్తున్నా. కమిషన్ వ్వవహరిస్తున్న తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది.
మీరు కమిషన్ బాధ్యతల నుంచి విరమించుకోవాలి
అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. అదీ కాక 2014 నాటికి సబ్ క్రిటికల్‌పై ఎటువంటి నిషేధం కానీ, నియంత్ర కానీ లేదు. 2017వరకు అమలు ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని పేర్కొంది. కానీ, 11-6-24న రోజున విలేఖరుల సమావేశంలో పైన తెలిపిన ఏ విషయాలు పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్‌పై విపరీత వ్యాఖ్యలు చేశారు. సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి మన రాష్ట్రంతో పాటు యావత్ దేశం విద్యుత్ రంగమే 90 శాతం సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్ ఉత్పత్తిపైనే ఆధారపడి ఉందన్న సంగతిని మీరు పూర్తిగా విస్మరించారు.
ఒకవైపు దేశంలో 90 శాతం సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్లు, చేయరాని తప్పు ఏదో చేసినట్లు మీరు మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టింది. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలూ లేవన్న వాస్తవాన్ని మీరు విస్మరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవసరమైన అన్ని చట్టబద్ధసంస్థల నుంచి అనుమతులు, ఆమోదాలు పొందిన తర్వాతే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పని ప్రారంభించి విజయవంతంగా నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అంకితం చేసిన సంగతిని మీరు విస్మరించడమే కాకుండా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు ఈ అంశాలను విచారించే విచారణ అర్హతను కోల్పోయారు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్ బాధ్యతల నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’
భద్రాద్రి థర్మల్ ప్లాంట్..
‘భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం.. చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ లోటుతో ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజల అవసరాలకు తీర్చడానికి పీక్ లోడ్ లాంటి అత్యవసర పరిస్థితులను అధిగమనించడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్సేంచ్ ల ద్వారా కరెంట్ కొనుగోలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే సమయంలో బీహెచ్ఎల్ ముందుకు వచ్చి కేవలం రెండేళ్లలోనే ప్లాంట్ సిద్దం చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన దరిమిలా అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా ఉండడానికి బీహెచ్ ఈఎల్కు నామినేషన్ పద్ధతిలో భదాద్రి థర్మల్ ప్లాంట్ పనులను అప్పగించాము. దీంతోపాటు మరొక ముఖ్య విషయం ఏంటంటే.. తెలంగాణ ఉద్యమం సమయం నాటి నుంచీ నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం, మా పార్టీ పాలసీ కాబట్టి.. బీహెచ్ ఈఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి , ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇవ్వడం జరిగింది. విలేకరుల సమావేశంలో మీరు చెప్పినట్లుగానే బీహెచ్ ఈఎల్ రెండేళ్లలోనే ప్లాంట్ నిర్మానం పూర్తి చేసి ఇస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడం వల్ల వారికి పనులు అప్పగించాము. అయితే మీరు చేసిన వ్యాఖ్యల్లో సత్వరం అవుతుందని ఇచ్చారు కానీ, అనుకున్నంత వేగంగా అది పూర్తికాలేదన్నట్లు దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లు మీరు మాట్లాడారు. ఇలా మాట్లాడేటప్పుడు.. భద్రాద్రి మీద ఎన్జీటీ విధించిన స్టే ఆర్డర్ కానీ.., కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయం కానీ మీరు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం.
చత్తీష్ గఢ్‌లో మిగులు విద్యుత్తు ఉన్నందుకే..
2014లో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ.. ఎంతటి తీవ్ర కరెంట్ సంక్షోభాన్నిన ఎదుర్కొందో నేను మీకు ముందే వివరించాను. అప్పటికి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా కేవలం దక్షిణ గ్రిడ్‌లోనే ఉంది. దీంతో ఈ కరెంట్ లోటును పూడ్చుకోవడానికి దక్షిణాధిలో ఎక్కడైనా విద్యుత్ అందుబాటులో ఉందా పరిశీలించాలని అప్పటి మా ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదేశించింది. దక్షిణాధి రాష్ట్రాల్లో ఎక్కడా కరెంట్ అందుబాటులో లేదని వారి అధ్యయనంలో తేలింది. దీంతోపాటు ఇతర గ్రిడ్లలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా విద్యుత్ అందుబాటులో ఉందా అనేది పరిశీలించాల్సిందిగా అప్పటి మా ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదేశించింది. పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్ Chathish Gadh )లో మిగులు విద్యుత్ ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకునే సాధ్యాసాధ్యాలపై ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థల అధికారులు సంప్రదింపులు జరిపారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చోపచర్చల అనంతరం ఛత్తీస్‌గఢ్ మొదట 1000 మెగావాట్లు, భవిష్యత్‌లో అవసరమైతే మరో 1000 మెగావాట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తర్వాత 3-13-2014 నాడు రాయ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాన 1000 మెగావాట్ల కరెంట్ కొనుగోలు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ సమయంలో్నే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరోఉ 1000 మెగావాట్లు సమకూర్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మరోసారి సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు లేవు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ గ్రిఢ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. మహారాష్ట్రలోని వార్దా నుంచి డిచ్పల్లి వరకు లైను నిర్మానం ప్రారంభించింది. దాని ద్వారా ఛత్తీస్‌గఢ్ కరెంట్ తెలంగాణకు తీసుకొచ్చే వీలుందని తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారుల పీజీసీఐఎల్ అధిరకారులతో సంప్రదింపులు జరిపారు. ఆ లైను నిర్మాణం సత్వరం పూర్తి కావడానికి భూసేకరణ, మొదలైన అంశాల్లో సహాయ సహకారాలు అందించారు. అప్పటికే సమయంలో పీజీసీఐఎల్ నిర్మిస్తున్న ఈ లైనులో దక్షిణాధి రాష్ట్రాలు పోటాపోటీగా కారిడార్ బుక్ చేయడం మొదలైంది. లైను నిర్మాణం పూర్తికాకున్నా ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ కూడా కారిడార్ బుక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అన్నీ.. ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించి మీరు మాట్లాడడం అత్యంత దురదృష్టకరం.’ అంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ లేఖపై కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
————————-
Vaadi bonda