ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్లో అక్రమ కట్టడాల కూల్చివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) నివాసం లోటస్ పాండ్లో (Lotus Pond) ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. ఆ ఇంటి ఆవరణలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన మూడు సెంట్రీలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేసినందున శనివారం జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు దాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెంట్రీని నిర్మించినందుకే దాన్ని కూల్చివేశామని అధికారులు చెప్పారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ(TDP) గెలిచి రెండు వారాలు కూడా కాకముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
