* టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని.. దీక్ష పేరుతో కేసీఆర్ ఎనిమిది రోజులు ఫ్లూయిడ్స్ తీసుకున్నారని.. దీక్ష పేరుతో కేసీఆర్ నాటకం చేశారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ తెలిపారు. కేసీఆర్ చేసిన దీక్ష విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. దీక్ష పేరుతో కేసీఆర్ ఎనిమిది రోజులు ఫ్లూయిడ్స్ తీసుకున్నారని..కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్టులను కేటీఆర్కు పంపుతామని పీసీసీ చీఫ్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణకు ఏం లాభం వచ్చిందన్నారు. ఉద్యమంలో చనిపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలేనని.. కేసీఆర్ దీక్ష మద్లనే విరమిస్తే విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు చలించిన సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేశారని.. కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణా రాలేదని.. కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. ఫ్లూయిడ్స్ తీసుకుని ఐరోమ్ షర్మిల 16సంవత్సరాలు దీక్ష చేశారన్నారు. ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ కోట్లాది రూపాయలతో దీక్షా దివాస్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని.. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ ఎస్, కేసీఆర్కు నూకలు చెల్లిపోయాయని అందుకే కేసీఆర్ బయటకు రావడం లేదన్నారు. మతం పేరుతో ఆర్ ఎస్ ఎస్ చిచ్చులు పెడుతోందని.. మతాల చిచ్చు పెట్టినన్ని రోజులు దేశం అభివృద్ధి సాధించలేదని తెలిపారు.
…………………………………………………
