* ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ
ఆకేరు న్యూస్ డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RESERVE BANK OF INDIA).. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(GOVERNOR SAKTHIKANTHA DAS).. శుక్రవారం ఉదయం సమీక్ష నిర్ణయాలు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా 6.50 శాతంగా ఉంచినట్లు తెలిపారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంకు రేటు 6.75 శాతంగా ఉంచారు. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలతో సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. RBI రెపో రేటును తగ్గిస్తే, రుణాలపై వడ్డీ తగ్గుతుంది. తగ్గింపు లేకపోవడంతో రుణగ్రహీతలు నిరాశకు లోనయ్యారు. యథాతథంగా ఉంచడమే ఉపశమనంగా కొందరు భావిస్తున్నారు.
…………………………