
* ఏకకాలంలో పలుచోట్ల దాడులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక అధికారులు, సిబ్బంది లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్(Narayanapet Makthal)లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఓ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి చిక్కారు. మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నర్సింహా అధికారులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. ఓ కేసు విషయంలో లంచం డిమాండ్ చేసి అధికారులు పట్టుబడ్డారు. అలాగే, భద్రాచలం(Badrachalam)లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ కూడా ఏసీబీకి చిక్కారు. అటవీ రేంజర్ ఉదయ కిరణ్(Uday Kiran), బీట్ ఆఫీసర్ హరిలాల్ అటవీ భూమి నుంచి మట్టిని తవ్వుకునేందుకు రైతును రూ. 30 వేలు డిమాండ్ చేశారు. ఆ రైతు ఫిర్యాదు మేరకు ఇల్లెందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఏసీబీ దాడులు (Acb Rides) నిర్వహించింది. అటవీ రేంజర్ ఉదయ కిరణ్, బీట్ ఆఫీసర్ హరిలాల్ ను లంచం తీసుకుంటుండగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
……………………………….