* 2026లో ప్రయోగం
* వివరాలు వెల్లడిరచిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ మిషన్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా.. ఈ మిషన్‌ను 2026లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా సోమనాథ్ ఈ కొత్త షెడ్యూల్‌ను వెల్లడిరచారు. చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్‌యాన్ యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి, సురక్షితంగా వారిని భూమిపైకి తేవడమే ఈ మిషన్ లక్ష్యం. ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతం తర్వాత తదుపరి మిషన్ అయిన గగన్‌యాన్ కోసం సిబ్బంది రేయింబవళ్లు చేసిన కృషితో ఈ మిషన్ సిద్ధమవుతున్నట్లు ఇస్రో చీఫ్ ఇటీవలే వెల్లడిరచారు. గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నది. ముగ్గురు వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తయిన కక్ష్యలోకి చేర్చి.. తిరిగి వారిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం మూడు రోజులపాటు జరగనున్నది. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది.
వాస్తవానికి 2022లోనే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయితా పడుతూ వచ్చింది. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. మరోవైపు రానున్న సంవత్సరాల్లో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను కూడా సోమనాథ్ వెల్లడిరచారు. శాంపిల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్-4 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక భారత్-అమెరికా సంయుక్తంగా చేపట్ట దలచిన నిసార్ మిషన్‌పై కూడా సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మిషన్‌ను వచ్చే ఏడాది అంటే 2025లోనే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జగ్జాతో చంద్రయాన్-5 మిషన్ ప్రయోగం చేపట్టనున్నామని, ఇది మూన్-ల్యాండిరగ్ మిషన్ అని వివరించారు. ఈ మిషన్ అసలు పేరు లుపెక్స్ లేదా ‘లునార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్’ అని చెప్పారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్న సమయాన్ని ఆయన వెల్లడిరచలేదు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2025లో ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని చంద్రయాన్-5గా సోమనాథ్ పేర్కొన్నారు కాబట్టి చంద్రయాన్-4 పూర్తయిన తర్వాత 2028లో చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
…………………………………….