ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపుల్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం, కళాశాలలో MPC ప్రథమ సంవత్సర చదువుతున్న పంగిడిపల్లి గ్రామానికి చెందిన కౌడగాని సుష్మ D/O మల్లికార్జున్ ఫెన్సింగ్ గేమ్ లో జాతీయ స్థాయికి ఎంపికైంది. 68వ SGFI ఫెన్సింగ్ గేమ్ లో జాతీయ క్రీడలకి అండర్- 19 విభాగంలో ఎంపిక అయ్యిందని, బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఫిబ్రవరి 8న జరగబోతున్న క్రీడల్లో పాల్గొనబోతున్నట్లు కేజీబివి ఏస్ ఓ సిహెచ్ అర్చన తెలిపారు. ఆమెకి పోటిల్లో పాల్గొనటానికి, ఇతరత్రా క్రీడ సామాగ్రికి పాఠశాల ప్రత్యేక అధికారిని సి హెచ్.అర్చన, ఉపాధ్యాయులు, సిబ్బంది,ఈటల సమ్మయ్య , అంకతి సాంబయ్య, దహగం రమేష్ ,NRI బోడ మల్లారెడ్డి చేసిన ఆర్థిక సహాయం పట్ల స్పెషల్ ఆఫీసర్ అర్చన, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వప్న సంతోషం వ్యక్తపరిచారు.
………………………………