
* ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బందోబస్తు
* ట్రాఫిక్ మళ్లింపు ప్రకటించిన పోలీసులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేశుడికి ఏటా ఆదరన పెరుగుతోంది. ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈసారి ఇంతకు మించి భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంత బందోబస్తును నిర్వహించనున్నారు. ఇక్కడ ఆరుగురు డీఎస్పీలు, 23 మంది ఇన్స్పెక్టర్లు, 52 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లను వినయోగిస్తున్నట్లు సమాచారం… ప్రతి రోజూ తరచుగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తాయని, 60 సీసీ కెమెరాల ద్వారా భక్తుల భద్రతను సవిూక్షించనున్నారు. అన్ని మార్గాల్లో డోర్ ఫ్రేం, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే దర్శనానికి అనుమతి ఉంటుంది. ఉత్సవ కమిటీల ప్రతినిధులు అతిథులు, వీఐపీలను సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే వచ్చేలా ఆహ్వానించాలని కోరారు. ఉత్సవ కమిటీ తరఫున 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని తమకు అందించాలని పోలీసులు కోరారు. తమ సిబ్బందికి అదనంగా వారి సేవలను 3 షిప్టుల్లో వాడుకుంటామని, మొత్తం 100 మందిని తమకు అప్పగిస్తే వారికి పోలీసు అధికారులు అవసరం మేరకు వినియోగించుకుంటారని ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు. ఖైరతాబాద్‌లో బుధవారం బడా గణేశ్ కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడిరచారు. ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్‌కాంపౌండ్, నెక్లస్ రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. ఈ నేపథ్యంలో పది రోజులపాటు వాహనాలు దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
………………………………