
Vinayaka idol in khairathabad
– నేడు భక్తులకు దర్శనం ఇచ్చిన భారీకాయుడు
– ఈ ఏడాదీ విశిష్టతలు ఎన్నెన్నో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వినాయక చవితి వస్తోందంటేనే అందరూ ఆసక్తిగా గమనించే రూపం.. జపించే
నామం ఖైరతాబాద్ మహా గణపతి.
ఈసారి ఎంత ఎత్తులో చేస్తున్నారు.. రూపం ఏంటి అనేది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
ఆ గణేశుడు ఈ ఏడాది కూడా ఆసక్తికర రూపంలో, అత్యంత ఎత్తులో మండపంలో కొలువుదీరాడు.
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులు దర్శనం ఇచ్చాడు.
బుధవారం ఉదయం 6 గంటల నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
విశ్వశాంతి మహాశక్తి గణపతిగా..
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖాలు, ఐదు తలల నాగసర్పం పడగ నీడన నిలబడి.. 8 చేతులతో విశ్వశాంతి
మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చాడు.
గణపతితో పాటు ఓ వైపున పురి జగన్నాధుడు సుభద్ర, బాలరాముల సమేతంగా ఉండగా మరో వైపున లక్ష్మీ
సామెత హైగ్రివ స్వామిలు తయారయ్యారు.
ఆదిలాబాద్‌కు చెందిన నర్సయ్యతో పాటు 20 మంది నిపుణుల బృందం రెండు నెలల పాటు శ్రమించి షెడ్డును నిర్మించింది.
తుఫాను, వరదలు వచ్చినా షెడ్డు కదలకుండా దాదాపు 75 అడుగుల ఎత్తుతో నిర్మించడం విశేషం.
ఒడిశా, తెలంగాణ, చెన్నై, కాకినాడ ఇలా ఎంతో ఎన్నో ప్రాంతాలకు చెందిన కళాకారులు గణపతి తయారీలో
నిమగ్నం అయ్యారు.
దాదాపు 120 మంది కళాకారులు మూడు నెలలపాటు శ్రమించి విగ్రహాన్ని తయారు చేశారు.
కోటీ 20 లక్షల వ్యయం
వినాయక విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు. గణనాథుడు, ఇతర విగ్రహాల తయారీకి 30 టన్నుల
స్టీలు, 4 మీటర్ల పొడవున్న మెష్ 40 బండిళ్లు, 30 కిలోల బరువుండే 1000 బ్యాగుల గుజరాత్ బంక మట్టి, 20
మీటర్ల పొడవున్నగోనెవస్త్రం 20 తాన్లు, 50 కిలోల సుతిలీ పౌడర్, 25 కిలోల బరువుండే 70 బ్యాగుల వరిపొట్టు,
15 మీటర్ల పొడవుండే 22 బండిళ్ల కోర బట్ట, సగం లారీ ఇసుక, 20 కిలోల బరువుండే 50 బండిళ్ల వరిగడ్డితో పాటు ఇతర వస్తువులనువినియోగించారు.
69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భారీ కాయుడిని తయారు చేశారు.
విగ్రహం బరువు 40 టన్నుల నుంచి 45 టన్నులు ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. తయారీకి
కోటీ 20 లక్షల రూపాయలు అయినట్లు వివరించారు.
——————————