* జూబ్లీ ఫలితం కాంగ్రెస్ పాలనకు తీర్పు
* రోజు రోజుకూ కాంగ్రెస్ ప్రజా బలం పెరుగుతోంది
* జూబ్లీ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం పెరుగుతుందనడానికి జూబ్లీ ఫలితాలే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీ ఫలితాల అనంతరం ఆయన జూబ్లీ అ\భ్యర్థి నవీన్ యాదవ్ ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ ఎస్ నేతలు హరాష్ రావు అసూయను కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. హరీష్ రావు చూసే చూసులకు పచ్చగడ్డి భగ్గుమంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని విమర్శించారు. కిషన్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం మాత్రమే ఇప్పుడు వచ్చాయన్నారు. ఇది భూకంపానికి ముందు వచ్చే చిన్న ప్రకంపన లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే కిషన్‌రెడ్డి భూ స్థాపితం అవుతారని పేర్కొ్న్నారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలంటూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యత ఏమిటో ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.హైడ్రా, ఈగల్ వంటివి ప్రజల కోసం తీసుకు వచ్చామన్నారు. కానీ వాటిపైనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విష ప్రచారం ఆపాలంటూ బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి బీఆర్ఎస్ అడ్డుతగులుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో తమ గెలుపు రెండేళ్ల పాలనకు ప్రతిఫలమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని సహకరించాలంటూ బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
………………………………….
