* ఎస్.డి.ఆర్. సేవలు ప్రశంసనీయం
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి లో అన్ని శాఖలతో పాటు పోలీసుల సహకారం అందడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండలం చల్వాయి లోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ఐదవ బెటాలియన్ లో నూతన జిమ్, ఓపెన్ ఏరియా జిమ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల పని చేయడం సాహసం చేయడం లాంటిదేనని, ఏ పని చేసిన ప్రజల మన్ననలు పొందడానికి కృషి చేయాలని అన్నారు. విపత్కర పరిస్థితులలో ఎస్ డి ఆర్ ఎఫ్ చేసిన సేవలు ప్రశంసనీయమని, ములుగు జిల్లాలోని కాకుండా వరంగల్ జిల్లాలో సైతం వారి సేవలను అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడే విషయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేయడం గొప్ప విషయమని అన్నారు. కష్టంతోనే ఫలితం దక్కుతుందని, ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. బెటాలియన్లు కావలసిన సౌకర్యాల ఏర్పాటుకు అనుకూలం కృషి చేస్తానని హామీ ఇస్తూ నూతన రోడ్డు ఏర్పాటు కోసం అంచనాలు తయారు చేసి సమర్పించాలని తెలిపారు. ములుగు జిల్లాలో పోలీస్ శాఖ చేస్తున్న సేవలు గొప్పగాని రానున్న రోజులలో వారి సేవలు ఇలాగే కొనసాగించాలని కోరారు. అనంతరం బెటాలియన్ లో కలెక్టర్ మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ బి. సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ – అనిల్ కుమార్, వరను గోపాల్ రెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
