* గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకు ఆదేశం
* జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం
* టాస్క్ ఫోర్స్ లో 10 మంది ప్రముఖ వైద్యులు
* మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం
ఆకేరు న్యూస్ డెస్క్ : కోల్కతా (Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) -హాస్పిటల్ (Hospital) లో జూనియర్ డాక్టర్ (Junior Doctor) హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు(Suprim Court)లో ఈరోజు విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐ(CBI)ని న్యాయస్థానం ఆదేశించింది. జాతీయస్థాయిలో నేషనల్ టాస్క్ఫోర్స్ (National Task Force) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు(Suprim Court) ఆదేశాలు జారీ చేసింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ఫోర్స్కు బాధ్యతలు అప్పగించింది. టాస్క్ ఫోర్స్ లో 10 మంది ప్రముఖ వైద్యులను సిఫార్సు చేసింది. కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (Asian Institute of Gastroenterology) అధిపతి డా.నాగేశ్వర్ రెడ్డి(Dr. Nageswar reddy) ఉన్నారు. విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ (FIR)ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆస్పత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(Justice Chandrachud) సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘ మహిళలు విధులకు వెళ్లలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే. మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క’’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
———————–