* ఎంపీ కావ్య
* హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
* హాజరైన కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరున్యూస్, హన్మకొండ: కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు జాతికి చిరస్మరణీయమని ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యానించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడియం కావ్య హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి ఎనలేనిదని, తెలంగాణ రాష్ట్రం కోసం తనదైన శైలిలో పోరాటం చేశారని కొనియాడారు. పద్మశాలీల అభ్యున్నతి కోసం, చేనేత కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఆదర్శమని, వచ్చే ఏడాదిలోపు హనుమకొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని, పద్మశాలిల అభివృద్ధి కోసం పాటుపడతానని ఎంపీ కావ్య హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ప్రత్యేక అధికారి రాంరెడ్డి, అఖిలభారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, రాష్ట్ర కార్యదర్శి తౌటమ్ రవీందర్, జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు, బీసీ సంఘాల జిల్లా కన్వీనర్ గడ్డం భాస్కర్, ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ,వెంగళ వేణుగోపాల్, రమేష్, ప్రచార కార్యదర్శి పులికంటి రాజేందర్, కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు పోరండ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రశాంత్, దాసి శంకరయ్య, ఆడెపు శ్రీకాంత్, గోలి రవి, పద్మశాలి కులస్తులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
………………………………..