Konda Surekha Apology to KTR
* నా ఉద్దేశం అది కాదు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వారసత్వ రాజకీయాలు, మాటల యుద్ధాలతో ఎప్పుడూ వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. గతంలొ కేటీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బహిరంగంగా వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు.
* రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు..
గతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులరీత్యా, ప్రతిపక్ష పార్టీలను విమర్శించే క్రమంలోనే ఆవేశంలో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని, అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని అనలేదని కొండా సురేఖ (Konda Surekha) స్పష్టం చేశారు. ఆనాడు తాను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేసి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
* కుటుంబ సభ్యులను నొప్పించే ఉద్దేశం లేదు..
కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ మానసికంగా బాధపెట్టాలని లేదా వారి ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. తన మాటల వల్ల వారు ఎవరైనా మనోవేదనకు గురై ఉంటే చింతిస్తున్నానని పేర్కొంటూ ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామంపై ఇరు పార్టీల శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

