Telangana Forest Jobs 2026
* టీజీలో 1,395 ఫారెస్ట్ ఉద్యోగాలు..
* ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రంలోని అటవీ శాఖలో వివిధ ఖాళీల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
* నవంబర్లో TGPSC నోటిఫికేషన్ విడుదల
అటవీ శాఖ పరిధిలో ఉన్న ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి వచ్చే నవంబర్ నెలలో అధికారిక జాబ్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల్లోని అటవీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఏయే జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా ఆసిఫాబాద్, మంచిర్యాల (NGKL), ఆదిలాబాద్ (ADB), భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అటవీ సంరక్షణ, రక్షణ బాధ్యతల్లో సిబ్బంది కొరతను తీర్చడానికి ఈ నియామకాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు.
* అర్హతలు.. వయసు వివరాలు..
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (Inter) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి : సాధారణ అభ్యర్థులకు వయసు 18 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలని సమాచారం.
వయో సడలింపు : నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలైన BC, SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో 36 ఏళ్ల వరకు సడలింపు ఉండే అవకాశం ఉంది. అలాగే దివ్యాంగులైన అభ్యర్థులకు ఈ పరిమితి 41 ఏళ్ల వరకు వర్తించవచ్చని తెలుస్తోంది.
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం ఆకర్షణీయంగా ఉండనుంది. నిబంధనల ప్రకారం నెలకు సుమారు ₹35,000 నుంచి ₹42,000 వరకు సాలరీ లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఇంటర్ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వెలువడిన వెంటనే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, ఇతర వివరాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవడం మంచిది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

