Konda Surekha Flexi Controversy
* ఫ్లెక్సీ, శిలా ఫలకాల్లో కానరాని మంత్రి సురేఖ పేరు
* కేసముద్రం మండలంలో ఘటన
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫ్లెక్సీ కనిపించకపోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు, కార్యక్రమానికి సంబంధించిన శంకుస్థాపన ఫలకాలపై కూడా మంత్రి సురేఖ పేరు లేకపోవడం మరింత చర్చకు దారితీసింది. కార్యక్రమంలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన సీట్లపై సైతం ఆమె పేరు కనిపించకపోవడం గమనార్హం. కొద్దిరోజులుగా కేసముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న ఫ్లెక్సీల వివాదం ఇంకా చల్లారకముందే తాజా ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అధికారిక కార్యక్రమంలో మంత్రి పేరు ఎందుకు కనిపించలేదు? ఇది కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యమా ? లేక రాజకీయ విభేదాలకు సంకేతమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
