Konda Surekha Photo Missing
* గూడూరు ప్రభుత్వ కార్యక్రమంలో కలకలం..
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని గూడూరు మండలంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం కలకలం రేపింది.
* ఫ్లెక్సీలో ఇతర మంత్రులకు చోటు
ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. ఫ్లెక్సీలో జిల్లా మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రుల ఫోటోలకు చోటు కల్పించగా.. పౌర సరఫరాల మంత్రి, ఎంపీ, ప్రభుత్వ విప్ ఫోటోలను ప్రముఖంగా ముద్రించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రం కనిపించకపోవడం చర్చకు దారితీసింది.
* రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
మంత్రి కొండా సురేఖను ఉద్దేశపూర్వకంగానే కార్యక్రమానికి దూరంగా పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలోనే మంత్రి ఫోటో లేకపోవడంపై జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
గూడూరు ఫ్లెక్సీ వ్యవహారం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామంతో కొండా సురేఖ వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఫ్లెక్సీలో ఆమె ఫోటో ఎందుకు లేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
