KTR Financial Assistance BRS Leaders
*శృతి చదువుకు అండగా బీఆర్ఎస్
ఆకేరు న్యూస్, ములుగు : చదువుకోవాలని ఎంతో ఆశ ఉంది.. కానీ పేదరికం నా అడుగులను కట్టడి చేస్తోంది. అంటూ ఓ నిరుపేద గిరిజన విద్యార్థిని ఎక్స్ వేదికగా చేసిన ఆవేదనభరిత విజ్ఞప్తిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటిఆర్ మనసును కదిలించింది. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, వీరాపూర్ గ్రామానికి చెందిన పెనుక శృతి కొడంగల్ అగ్రికల్చరల్ కాలేజీలో బి ఎస్సీ సీటు సాధించింది.
అయితే రోజువారీ కూలి పై ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబానికి సంవత్సరానికి అయ్యే విద్యా ఖర్చులు భరించడం భారంగా మారడంతో, శృతి పడిన ఇబ్బందిని గుర్తించి కేటిఆర్ స్పందించారు.
*రూ. 50 వేల ఆర్థిక సాయం..
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్వయంగా శృతి కుటుంబాన్ని కలిసి రూ. 50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంలో లక్ష్మణ్ బాబు శృతిని కేటిఆర్ తో నేరుగా ఫోన్ కాల్ మాట్లాడించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపారు.
ఆయన శృతికి ఫోన్లో అభయమిస్తూ.. “ఏం భయం లేదుమ్మా, నీ చదువు బాధ్యత నాది.. ధైర్యంగా ముందుకు వెళ్ళు, బాగా చదువుకో” చదువుకొని నీలాంటి పేద విద్యార్థులకు నలుగురికి సాయం చేయాలని సూచించారు.
ఒక చిన్న ట్వీట్‌కు స్పందించి, ఆప్యాయంగా ఫోన్ చేసి మాట్లాడి, తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అండగా నిలిచిన కేటిఆర్ కు ఆర్థిక సాయం అందజేసిన జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు కు శృతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత , తాడ్వాయి మండలం అధ్యక్షులు దండుగల మల్లయ్య, కాకులమర్రి ప్రదీప్ రావు , తుమ్మ మల్లారెడ్డి , కూనూరు అశోక్ గౌడు ,తాడూరి రఘు , ఎండి ఖాజా పాషా, కర్ర రవీందర్,పులుసం పురుషోత్తం, రామాలయం గుడి చైర్మన్ దన్నపునేని కిరణ్, రఫిక్, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజరావు, వావిలాల ముత్తయ్య,కొండాయి చిన్ని, తాళ్ల పెళ్లి మోహన్, బాస శరత్, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

