* అరాచకాలు బయటపడుతుంటే భయం పట్టుకుంది
* చట్టం తనపని తాను చేసుకుపోతుంది
* రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
* తొర్రూరు మార్కెట్ కమిటీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
ఆకేరున్యూస్, మహబూబాబాద్: ‘గుమ్మడి కాయల దొంగ అంటే.. భుజాలు ఎందుకు తడుముకుంటున్నవ్ కేటీఆర్..?‘ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (PONGULETI SRINIVAS REDDY) ప్రశ్నించారు. కేటీఆర్.. (KTR) నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు.. పడబోయే శిక్ష ఏంటో నీకు తెలుసు అని మంత్రి అన్నారు. 11 నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. గురువారం తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘తల తాకట్టు పెట్టయిన డిసెంబర్ లోపు 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని అన్నారు. ‘రుణమాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడతావో ఆలోచించుకో‘ అని అన్నారు. తాను బీఆర్ఎస్(BRS)లో చేరే సమయంలో కేసీఆర్ను తండ్రిలా భావించి కాళ్లు మొక్కానని అన్నారు. కానీ తడిగుడ్డతో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకొనే అవసరం లేదని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ‘పొంగులేటి హోం మంత్రా..? అలా ఎందుకు మాట్లాడుతున్నారు‘ అని అంటున్నారని, తాను క్యాబినెట్ మంత్రినని, అన్ని విషయాలూ మాట్లాడుతానని అన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానని అంటున్నారని, పాదయాత్ర చేస్తారో.. మోకాళ్ల యాత్ర చేస్తాడో నిర్ణయం ఆయనే తీసుకోవాలని పొంగులేటి ఎద్దేవా చేశారు. తాను ఆ పార్టీ, ఈ పార్టీ నేతలను అరెస్టు చేస్తారని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. దానికి శ్రీనివాస్ రెడ్డి అదాని కాళ్లు మొక్కాడని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు చట్టం తెలుసునని, ఎప్పుడు, ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల 19 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.. ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ఇందిరమ్మ ప్రభుత్వం విూద బావ బావమరిది తప్పుడు ప్రచారు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యక్షంగా రైతుల కోసం ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేశాం.. మిగతా 12 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బావ బావమరిది తల ఎక్కడ పుట్టుకుంట్టారో అప్పుడు చెప్పుతామని అన్నారు. పేదల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి రైతుబంధు కొంచెం ఆలస్యమవుతుందని మంత్రి అన్నారు. తాము ఇచ్చే స్మార్ట్ కార్డు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి అని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిలో విదేశాల సంస్థలకు ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొస్తున్నాం.. దేశంలో ఎక్కడ లేనటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. తప్పు చేస్తే పేదవాడి సొమ్మును కొల్లగొడితే పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గుమ్మడికాయ దొంగ అంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నావో చెప్పాలన్నారు. నీవు ఎందుకు పాదయాత్ర చేస్తున్నావో ప్రజలకు చెప్పాలని తెలిపారు. మనిషిని మనిషిలా గౌరవించని విూరు.. పదవిపోయే సరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చట్టానికి తెలుసు.. ఎప్పుడు, ఎక్కడ ఏమి జరగాలో తెలుసు.. త్వరలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులకిచ్చిన మాటని తుచ తప్పకుండా చేస్తామన్నారు. రైతన్నలకి, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల వరకు కొత్త పింఛన్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అన్ని పథకాలు ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి అనుమాండ్ల రaాన్సీరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి అలాగే ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు.
…………………………………………………..