* కొడంగల్ లిఫ్ట్ మేఘాకు ఇవ్వడంపై కేటీఆర్ విమర్శలు
* వారి బంధం వెనుక మతలబు ఏంటని ప్రశ్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సుంకిశాల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanthreddy)కి, మేఘా కంపెనీకి ఉన్నబంధం వెనకున్న మతలబు ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister Ktr) ప్రశ్నించారు. ఈమేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మేఘా ఇంజినీరింగ్ (Mega Engineering)సంస్థపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఔదార్యం చూపిస్తున్నారని అన్నారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సుంకిశాల ప్రాజెక్టు(Sunkisala Project) ప్రమాదానికి కారణమైన ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఆ సంస్థకు రూ.4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి (CM.Revanthreddy) అప్పజెప్పనున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళ్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. నేడు అదే సంస్థపై ఎందుకింత ఔదార్యం, ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలిపాలన్నారు. మేఘా ఇంజినీరింగ్‌పై రేవంత్‌కు ఉన్న ప్రత్యేక ఆసక్తి, అందులోని ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
—————–