
ఆకేరు న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ( PHONE TAPPING) వ్యవహారంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కల్వకుంట్ల తారక రామారావు లీగల్ (KTR)నోటీసులు పంపారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని దీనికి కీలక సూత్రధారి కేటీఆర్ అని బండి సంజయ్(BANDI SANJAY) ఆరోపించారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని గుడికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని కేటీఆర్‌కు బండి సవాల్ విసిరారు. కేటీఆర్ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఎలాంటి ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు రక్షణగా ఉన్నాయని ఆరోపించారు. సిట్ అధికారులకు ఆధారాలు ఇచ్చానని, ఫోన్ ట్యాపింగ్ విచారణను సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలకు స్పందించిన కేటీఆర్ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు.
…………………………………………