* సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలివే!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తో కలిపి ఆయనను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరినీ సిట్ (SIT) అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొదటగా 2023లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళాలు ఎలా వచ్చాయి? ఎలక్టోరల్ బాండ్ల గురించి సిట్ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు 8 వేల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? అప్పట్లో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేశారా.. లేదా? అని ప్రశ్నించినట్లుగా సమాచారం.
అదేవిధంగా, ఒక ప్రైవేటు ఛానల్ ఎండీ బ్యాంక్ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయో చెప్పాలని సిట్ అధికారులు కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా? కేసులో కీలక నిందితులు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులతో వాట్సాప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా ఎందుకు మాట్లాడారో చెప్పాలని కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. చివరగా, ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు తెప్పించారు? సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు? అనే అంశాలపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నట్లు సమాచారం.
………………………………………………………………..
