* నీళ్ళుండి రైతులకు అందించలేని అసరమర్ధత
* కేసీఆర్ కు భయపడి కాళేశ్వరం నీళ్ళు వదిలారు
* బోర్ల రామిరెడ్డి మళ్ళీ బోర్లు వేయాల్సి వచ్చింది
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, నల్గొండ : ఇదీ ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే. కాలం తెచ్చిన కరువు కానే కాదు. ఇంత కాలం పాడయిపోయింది ,పనికిరాదన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram ) నీళ్ళు ఇపుడెందుకు వదులుతున్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )ప్రశ్నించారు. పంటలు ఎండుతున్న రైతులను పరామర్శించేందుకు జనగాం, సూర్యాపేట జిల్లాల్లో కేసీఆర్ పర్యటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బెంబేలెత్తి పోయిందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 5న పొలంబాట కార్యక్రమం ఉండడంతో వెంటనే నీళ్ళను ఎత్తి పోస్తున్నారు.. రాజకీయ స్వార్ధం పక్కన బెట్టి ఇప్పటికే నీళ్ళను అందిస్తే వేలాది ఎకరాల్లో పంట ఎండకుండా ఉండేదన్నారు. నల్గొండ జిల్లా మూసంపల్లి గ్రామాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడ బోర్ల రామిరెడ్డిగా పేరున్న బైరెడ్డి రామిరెడ్డిని, గన్నెబోయిన మల్లయ్య యాదవ్‌లను కలుసుకున్నారు. దాదాపు 90 బోర్లు వేసిన రామిరెడ్డి ని ఉదాహరిస్తూ కేసీఆర్ ఉద్యమ సమయంలో అనేక బహిరంగ సభల్లో ప్రస్తావించేవారని కేటీఆర్ అన్నారు. అసలు ఇంటిపేరు బైరెడ్డి మరచిపోయి అందరూ బోర్ల రాం రెడ్డిగానే పిలిచేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్నపదేండ్ల కాలంలో ఎన్నడూ కూడా బోర్ వేయాల్సిన అవసరం రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు బోర్లు వేశానని రాంరెడ్డి చెబుతున్నాడని కేటీఆర్ వివరించారు.గన్నెబోయిన మల్లయ్య యాదవ్ పరిస్థితి కూడా ఇదే విదంగా ఉందన్నారు.
* మళ్ళొచ్చింది నీటి తిప్పలు
పదేండ్ల కాలంలో సాగునీటికి సమస్యలేకుండా టెయిల్ ఎండ్ భూములకు కూడా నీరందించాము. ఇపుడు నీళ్ళు లేక పంటలు ఎండుతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటినయి. తాగునీటి కష్టాలు కూడా పెరిగినాయన్నారు.ఇదంతా కాంగ్రెస్ అసమర్ధతేనన్నారు. వ్యవసాయ మంత్రి కాలం తెచ్చిన కరువు అంటున్నారు. కాలం తెచ్చిన కరువు కాదు. మీ కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువే. పిల్లర్లు కుంగిపోతే 110 రోజులు వాటిని రిపేరు చేయడానికి సరిపోలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర తాపత్రయమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక విఫల ప్రాజెక్ట్‌గా భ్రమ కల్పించారు. నీళ్ళుండి రైతాంగానికి అందించలేదు. కరీంనగర్‌కు కేసీఆర్ వస్తున్నాడనగానే నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్‌లకు నుండి నీటిని ఎత్తి పోసి కరీంనగర్‌కు నీళ్ళిస్తున్నారు. పనికి రానిప్రాజెక్ట్ నుంచి ఇపుడెట్లా నీళ్ల ఎత్తి పోయగలుగుతుయన్నా రు.
* పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలి.
నీటి సమస్య వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలి. రైతు బంధు కూడా రైతులందరికీ వెంటనే అందించాలి. రైతులు ఇంత తీవ్రంగా నష్టపోయి ఆవేదనతో కుమిలిపోతుంటే ముఖ్యమంత్రి , మంత్రి వర్గం ఒక్కరూ కూడా రైతాంగానికి ఆత్మస్థయిర్యం నింపడానికి ముందు రావడం లేదు. రైతులు గుండెనిబ్బరం కోల్పోవద్దు. అండగా బీఆర్ ఎస్ పార్టీ ఉందని కేటీఆర్ రైతులకు హామి ఇచ్చారు.
—————————————-