
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను హైద్రాబాద్ లోని పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ ఎస్ శ్రేణులు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తన పుట్టిన సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
బర్త్ డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్
కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ నిమగ్నమవుతూ
రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. తెలంగాణ సీఎంఓ అధికారిక ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
…………………………………………….