* తొలిసారిగా అరుదైన దృశ్యం
* అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాపతా లేడీస్’ వీక్షించనున్నసీజేఐ, న్యాయమూర్తులు
ఆకేరు న్యూస్ డెస్క్ : పలు కేసుల వాదోపవాదాలు.., విచారణలు, తీర్పులు, శిక్షలకు వేదికగా ఉండే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఓ అరుదైన కార్యక్రమానికి వేదిక కాబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టులో ఓ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. సుప్రీం కోర్టు ( Supream Court ) ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారుల కోసం బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ ( La patha Ladies ) ను ప్రదర్శించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 4:15 నుంచి 6:20 వరకూ అడ్మినిస్ట్రేషన్ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించనున్నారు. ప్రముఖ నటులు ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు కూడా రానున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
—————————————-