* ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్మాసిటీపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డరాన్న నెపంతో లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను అరెస్టు చేసి జైలులో ఉంచగా.. హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్య రావడంతో అతడికి సంకెళ్ళతోనే జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైధ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, హీర్యా నాయక్‌ను పరామర్శించారు. కాగా, లగచర్ల రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలను ఆరా తీసిన ముఖ్యమంత్రి రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
………………………..