* ఘనంగా లష్కర్ బోనాలు
* భక్తజనసంద్రంగా సికింద్రాబాద్ పరిసరాలు
* అమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) బోనాల సంబురంతో కళకళలాడుతోంది. సికింద్రాబాద్ (Secunderabad) భక్తజనసంద్రంతో నిండిపోయింది. బోనాలతో మహిళలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మహాకాళికి బోనాలు (Bonuses for Mahakali) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మమ్మేలు తల్లీ మహాకాళీ (Mahakali) అని వేడుకుంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహాకాళి (Ujjain Mahakalini) ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) దర్శించుకున్నారు. ఉదయం 8.30కే ఆలయానికి విచ్చేశారు. అమ్మకు బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘనం స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు.
————————-