
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భూమి ప్రభుత్వానిదేనని నిన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు స్వయంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించారు. అయినా ఆందోళనలు ఆగడం లేదు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై హెచ్‌సీయూ (HCU) విద్యార్థులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో బుధవారం ఉదయమే హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా, విద్యార్థులను బయటకు రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి (CONGRESS GOVERNMENT) వ్యతిరేకంగా బుధవారం ఉదయం హెచ్‌సీయూ క్యాంపస్‌లో ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరసన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
…………………………………