ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి రేపటికి వాయిదా పడిరది. లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేసినా లగచర్ల రైతుల అంశంపై చర్చకు అనుమతించలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు. దీంతో మండలి చైర్మన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ సభ్యులు ధర్నాకు దిగారు.
………………………………..