
* మేడారం చినజాతర.. తరలివస్తున్న భక్తజనం
* దిష్టి తోరణాలు కట్టడంతో ఉత్సవం ప్రారంభం
ఆకేరు న్యూస్, మేడారం : మేడారంలో సమ్మక్క-సారలమ్మల(sammakka-saralamma) చిన్నజాతర ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ఆలయ పూజారులు తొలిరోజు దిష్టి తోరణాలు కట్టడంతో ఉత్సవం ప్రారంభమైంది. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మెక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనంగా ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే మేడారం (Medaram)మహాజాతర రెండేళ్లకోసారి అతి వైభవంగా జరుగుతుంది. మహా జాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది. చిన్నా పెద్దా జాతరెల్లిపోదాం అంటూ మేడారం బాట పట్టడం ఈ జాతర ప్రత్యేకత. తెలంగాణ (Telangana)నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్(Andrapradesh), మహారాష్ట్ర(Maharastra), ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మాఘ శుద్ధ పౌర్ణమి అయిన నేటి నుంచి నాలుగు రోజుల పాటు మండమెలిగే పండుగగా వ్యవహరిస్తూ పూజారులు ఈ చిన్నజాతరను ఆద్యంతం ఘనంగా నిర్వహిస్తారు. మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలోనూ శుద్ధి నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. చిన్న జాతరకు 20లక్షల మంది వస్తారనే అంచనాతో రూ.5.30 కోట్ల వ్యయంతో అధికారులు ఏర్పాట్లు చేశారు.
……………………………………..