* ఆసుపత్రిలో చేరిక
* ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని అద్వానీ మరోసారి అస్వస్థతకు గురికాగా ఆయన్ని ఢల్లీిలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను పర్యవేక్షించి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అద్వానీఅస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం ఏడాదిలో ఇది నాలుగోసారి. కొంతకాలంగా అద్వానీ వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
…………………………………