ఆకేరు న్యూస్, హనుమకొండ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదుశానుసారం నవంబర్ 15న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తులు నిర్మల గీత,కేపి పట్టాభిరాంలు తెలిపారు. హన్మకొండ అదాలత్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ 15 న హన్మకొండ జిల్లా కోర్టులో పరకాల కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్ కేసులు,ఎన్. ఐ యాక్టు బ్యాంకు రికవరీ కేసులు ఇరు పక్షాల అంగీకారంతో రాజీపడదగు కేసులు పరిష్కరించబడతాయన్నారు. రాజీ పడాలనుకునే కక్షిదారులు తమ న్యాయవాదులతో నేరుగా హాజరు కావాలని కోరారు. రాజీ మార్గమే ఉత్తమ మార్గమని కాలాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
………………………………………….
