ఆకేరు న్యూస్ డెస్క్: నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశం లోక్ సభను కుదిపేసింది. నీట్ పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ తర్వాత చర్చిద్దామని స్పీకర్ చెప్పారు. తొలుత నీట్పైనే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. విపక్షాల ఆందోళనలపై దేవెగౌడ (Deve Gowda) ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి కేంద్రం సరైన చర్యలే తీసుకుందని వెల్లడించారు. అనవసరంగా రాద్దాంతం చేయడం సరికాదని అన్నారు. అయితే.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ వల్ల ఆందోళనలో ఉన్న విద్యార్థులకు సభ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సి ఉందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. విద్యార్థులకు అండగా ఉంటామన్న భరోసాను అధికార, విపక్షాలు ఇవ్వాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సభలో నీట్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలంటూ విపక్షాల ఆందోనళ నడుమ సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
———————